: టీమిండియా-బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ తేదీ మార్పు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ గ్రూప్ దశ ముగింపుకు వచ్చింది. తదుపరి క్వార్టర్ ఫైనల్ సమరాలు జరగనుండగా, భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య క్వార్టర్స్ పోరు దాదాపు ఖరారైంది. అయితే, తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ను మార్చి 21న వెల్లింగ్టన్ లో నిర్వహించాలని భావించారు. కానీ, షెడ్యూల్ ను సవరించడంతో టీమిండియా క్వార్టర్ ఫైనల్ పోరు మార్చి 19న మెల్బోర్న్ వేదికగా జరగనుంది. దీంతో, మ్యాచ్ కాస్త ముందుకు జరిగింది. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే జట్టుతో శనివారం తలపడనుంది.