: 'కేసీఆర్ ఫేక్ ప్రామిసెస్' పేరుతో ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు తెరిచాం: షబ్బీర్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. కేవలం తమ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే... కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై కేసీఆర్ కు ఫర్మానా పంపితే తమకు వద్దని వెనక్కు పంపారని ఎద్దేవా చేశారు. తప్పుడు హామీలతో ప్రతిరోజు ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ పై జనాలే స్పందించే రోజు వస్తుందని చెప్పారు. కేసీఆర్ తప్పుడు హామీలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో... 'కేసీఆర్ ఫేక్ ప్రామిసెస్' పేరుతో ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను తెరిచామని వెల్లడించారు.