: మీ హీరో రాలేదా?... టీడీపీ సభ్యులతో నరసింహన్
రాజ్ భవన్ లో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో, జాతీయ గీతాలాపన వేళ అనుచితంగా ప్రవర్తించారంటూ... తెలంగాణ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సభ్యుల సస్పెన్షన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన, టీడీపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష ఉపనేత రేవంత్ రెడ్డి వారిలో లేకపోవడాన్ని గమనించారు. వెంటనే, "మీ హీరో రేవంత్ రెడ్డి రాలేదా?" అంటూ సరదాగా అడిగారు. దీంతో, వారు రాలేదని బదులిచ్చారు. అనంతరం, వారు తమ సస్పెన్షన్ పై నరసింహన్ కు ఫిర్యాదు చేసి వెనుదిరిగారు.