: వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు - పార్ట్ 2
ఈ ఉదయం 12:15 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలివి...
* కూరగాయల రైతుల ప్రోత్సాహకానికి రూ. 58.25 కోట్లు
* పామాయిల్ తోటల సాగుకు రూ. 28.90 కోట్లు
* బైవోల్టిన్ ముడిపట్టు ఉత్పత్తికి రూ. 93.61 కోట్లు
* షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ. 9.74 కోట్లు
* ఎస్టీల అభివృద్ధికి రూ. 2.16 కోట్లు
* పశువసతి గృహాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు
* చేపపిల్లల క్షేత్రాల ఆధునికీకరణకు రూ. 16 కోట్లు
* టీకాలు, పశుగ్రాస బ్యాంకులకు రూ. 15.18 కోట్లు
* ఉపాధి హామీ పథకానికి రూ. 2,717 కోట్లు
* మత్స్యకారుల డీజిల్ రాయితీకి రూ. 14 కోట్లు
* కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలకు రూ. 10.20 కోట్లు
* బెస్తల సహాయ సంక్షేమం కోసం రూ. 10.13 కోట్లు
* ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
* ఏడు జిల్లాల్లోని 238 మండలాల్లో కరవు
* పట్టు పరిశ్రమలో మహిళలకు అధిక ప్రాధాన్యం
* జౌళి ఉత్పత్తుల ఎగుమతులకు కృషి
* మల్బరీ తోటల విస్తీర్ణం పెంచేందుకు కృషి
* అధునాతన టెక్నాలజీతో యువతకు శిక్షణ
* అనంత, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలో మల్బరీ తోటల పెంపకం
* కేంద్రం స్పాన్సర్ చేసే కార్యక్రమాలకు రూ. 17 కోట్లు
* ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతాం
* వ్యవసాయ రంగంలో సుస్థిరతకు ప్రాధాన్యం
* ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాం
* రెండంకెల వృద్ధి రేటు సాధనే లక్ష్యం