: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు - పార్ట్ 1
ఈ ఉదయం 12:15 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలివి...
* మొత్తం వ్యవసాయ శాఖ బడ్జెట్ రూ. 14,184 కోట్లు
* ప్రణాళికా వ్యయం రూ. 4,513.45 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 9,670.58 కోట్లు
* రైతు రుణ మాఫీకి రూ. 5,000 కోట్లు
* ఉచిత విద్యుత్ కు రూ. 3,000 కోట్లు
* అనుబంధ రంగాలకు రూ. 2,717 కోట్లు
* మార్కెటింగ్ కు రూ. 17.83 కోట్లు
* సహకార శాఖకు రూ. 7.88 కోట్లు
* మత్స్య శాఖకు రూ. 36.50 కోట్లు
* వెంకటేశ్వర పశు వైద్యశాలకు రూ. 124.48 కోట్లు
* వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి రూ. 53 కోట్లు
* రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యవసాయం ఎంతో ముఖ్యం
* పశుగణాభివృద్ధికి రూ. 73.73 కోట్లు
* పశు వైద్యశాలల ఆధునికీకరణకు రూ. 9.74 కోట్లు
* భూసార పరీక్షా కేంద్రాలకు రూ. 90.95 కోట్లు
* విత్తన మార్పిడి నిమిత్తం రూ. 80 కోట్లు
* వడ్డీ లేని రుణాలకు రూ. 172 కోట్లు
* పావలా వడ్డీ రుణాలకు రూ. 10 కోట్లు
* పంటల బీమాకు రూ. 172 కోట్లు
* మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 20 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 14.63 కోట్లు
* విస్తరణ సేవలకు రూ. 81.21 కోట్లు
* జలవనరుల పరిరక్షణ కోసం రూ. 30 కోట్లు
* మార్క్ ఫెడ్ కు రూ. 60 కోట్లు
* అగ్రికల్చర్ నేషనల్ మిషన్ కు రూ. 168.93 కోట్లు
* సమగ్ర పోషక యాజమాన్యానికి రూ. 90.95 కోట్లు
* పొలంబడి కార్యక్రమానికి రూ. 1.46 కోట్లు
* ఉద్యాన పంటల అభివృద్ధికి రూ. 100 కోట్లు
* బిందు, తుంపర సేద్యానికి రూ. 144.07 కోట్లు