: కార్పొరేట్ గూఢచర్యం కేసులో ఓ సీఏ, ఇద్దరు ప్రభుత్వాధికారుల అరెస్టు
ఇటీవల బయటికొచ్చిన కార్పొరేట్ గూఢచర్యం కేసులో తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. తాజాగా సీబీఐ ఢిల్లీలోని ఆరు మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, ముంబయిలోని రెండు చోట్ల సోదాలు జరిపింది. ఈ క్రమంలో ముంబయికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్, ఇద్ద ప్రభుత్వ అధికారులను అదుపులోకి తీసుకుంది. విదేశీ పెట్టుబడి విధానానికి సంబంధించిన పత్రాల్లోని విలువైన సమాచారాన్ని కార్పొరేట్ గ్రూప్స్ కు అమ్మినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల కిందట ఇదే వ్యవహారంలో పలువురిని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.