: స్మృతి ఇరానీ, హేమమాలిని, నజ్మా హెప్తుల్లాలను పక్కనబెట్టిన బీజేపీ

భారతీయ జనతా పార్టీ ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో ప్రముఖ మహిళా నేతలను పక్కనబెట్టారు. మొత్తం 111 మంది సభ్యులను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఈ జాబితాలో చోటు లభించలేదు. చోటు దక్కని ఇతర ప్రముఖుల్లో నజ్మాహెప్తుల్లా, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని, మహారాష్ట్ర యువ నేత షైనా ఎన్‌సీ తదితరులు ఉన్నారు. వీరిని తీసుకోకపోవడానికి గల కారణాలను మాత్రం బీజేపీ వెల్లడించలేదు.

More Telugu News