: సినీ ప్రముఖుల దగ్గర డబ్బు ఉందనుకుంటారు: మురళీమోహన్

సినీ ప్రముఖుల దగ్గర కోట్ల డబ్బు ఉంటుందని భావించడం సర్వసాధారణమని సీనియర్ నటుడు, ఎంపీ మురళీమోహన్ అన్నారు. హైదరాబాదులో సినీ ప్రముఖల పట్ల ఐటీ శాఖ తీరుపై ఆయన మాట్లాడుతూ, కొందరు నిర్మాతలు భార్యల మంగళసూత్రాలు తాకట్టు పెట్టి సినిమాలు నిర్మించిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. మొదట్లో సినిమాల ద్వారా డబ్బులు సంపాదించినా, చివర్లో అంత్యక్రియలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డవారూ ఉన్నారని ఆయన చెప్పారు. అప్పులు చేసి పన్నులు కడుతున్నారని ఆయన తెలిపారు. పన్నుల పేరుతో తమను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. సినీ పరిశ్రమను ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని కోరారు.

More Telugu News