: శ్రీహరికోటలో మరో ల్యాంచ్ ప్యాడ్ కు ఇస్రో నిర్ణయం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో ప్రస్తుతం రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. వీటిని జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ రాకెట్లు ప్రయోగించేందుకు ఉపయోగిస్తున్నారు. అదనంగా మరో లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు ఇస్రో ప్రతిపాదనలు పంపిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భవిష్యత్తులో పెరగనున్న లాంచింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్యాడ్ నిర్మించనున్నారని ఆయన వివరించారు. మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించారు.