: మోదీకి లేఖ రాసిన కేసీఆర్
ధాన్యం లెవీ సేకరణను నిలిపివేయరాదంటూ ప్రధాని నరేంద్ర మోదీకి టీఎస్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విన్నవించారు. లెవీ సేకరణను నిలిపివేస్తే రైతులు నష్టపోతారని తెలిపారు. ఈ మేరకు మోదీకి కేసీఆర్ ఈరోజు ఓ లేఖ రాశారు. లెవీ సేకరణను నిలిపివేస్తే రైతులు కనీస మద్దతు ధరను కోల్పోయే అవకాశం ఉందని లేఖలో తెలిపారు.