: సునందా పుష్కర్ కేసులో పాక్ జర్నలిస్టును విచారించనున్న ఢిల్లీ పోలీసులు

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో పాక్ జర్నలిస్టు మెహర్ తరార్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బాస్సి మాట్లాడుతూ, "తరార్ ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో ఆమెతో కూడా మాట్లాడతాం" అని అన్నారు. దానిపై తరార్ స్పందిస్తూ, "ఏ విచారణకైనా సిద్ధమే. నన్ను విచారించడానికి వారిని (పోలీసులు) ఆహ్వానిస్తున్నా. అయితే, భారత్ వచ్చేందుకు నేను సిద్ధంగా లేను. వారే లాహోర్ రావచ్చు" అని పేర్కొంది. కాగా, గతంలో సునందాతో ట్విట్టర్ లో జగడం తను చేసిన అతిపెద్ద తప్పని తరార్ పేర్కొంది. త్వరలోనే ఇదంతా ముగుస్తుందని, ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని అంటోంది. సునందా చనిపోకముందు థరూర్ తో ఆమె వాగ్యుద్ధానికి తరారే కారణమని ఆరోపణలు వచ్చాయి.

More Telugu News