: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-4
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు...
* సతత హరిత నగరంగా నూతన రాజధాని
* 39,252 ఎకరాల్లో రైతుల సమ్మతితో నిర్మాణం
* మూడేళ్లలో రైతులకు తిరిగి భూమి అప్పగింత
* గోదావరి పుష్కరాలకు రూ. 1,368 కోట్లు
* పుష్కరాల విజయవంతానికి అన్ని శాఖలతో సమన్వయం
* రహదారి వ్యవస్థను మెరుగు పరుస్తాం
* రహదారి ప్రమాదాలను తగ్గిస్తాం
* లెర్నర్ లైసెన్స్ తీసుకునే సమయంలోనే భద్రతపై అవగాహన
* పోర్టులను అభివృద్ధి చేసేందుకు కృషి
* కళింగపట్నం, నరసాపురం నౌకాశ్రయాల్లో పీపీపీ విధానంలో అభివృద్ధి
* విజయవాడ, తిరుపతి, విశాఖ విమానాశ్రయాల అభివృద్ధి
* దొనకొండ, నాగార్జున సాగర్, కుప్పం, దగదర్తి, ఓర్వకల్లు వద్ద ప్రాంతీయ విమానాశ్రయాలు
* చమురు రంగంలో వ్యాపారం చేయనున్న ఏపీజీడీసీ
* కాకినాడ డీప్ వాటర్ పోర్టు కేంద్రంగా చమురు వ్యాపారం
* చమురు రంగంలో పనుల కోసం రూ. 195 కోట్ల కేటాయింపులు
* చిత్తూరు జిల్లలో మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం
* మాన్యుఫాక్చరింగ్ జోన్ కు భూ సేకరణ నిమిత్తం రూ. 637 కోట్లు
* కొత్త పర్యాటక పథకాల అమలు
* కొత్త రాజధానిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విజయవాడ భవానీ ద్వీపం
* కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిజం సర్క్యూట్లు
* 50 స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రోత్సాహం
* ఎర్రచందనాన్ని కాపాడేందుకు కార్యాచరణ
* అటవీ భూముల వృద్ధికి 50 కోట్ల నర్సరీ మొక్కల పెంపకం
* హోం గార్డులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 2 లక్షల పరిహారం
* అర్చకుల కనీస నెల జీతం రూ. 5 వేలు
* రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3 శాతం, రెవెన్యూ లోటు 1.24 శాతం