: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-3
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు...
* కొత్త రాజధానికి రూ. 3,168 కోట్లు
* రెవెన్యూ శాఖకు రూ. 1,429 కోట్లు
* సాగునీటి రంగానికి రూ. 5,258 కోట్లు
* ఎస్సీల అభివృద్ధికి రూ. 5,878 కోట్లు
* కొత్త ఆయకట్టు కోసం నిర్మాణంలో 92 పథకాలు
* షెడ్యూల్ కులాల సాధికారతకు కట్టుబడి ఉన్నాము
* గిరిజన స్కూల్స్ లో ఫలితాలు భేష్
* సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మారుస్తాం
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 'ఎన్టీఆర్ విద్యోన్నతి'
* రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అధీనంలో 7 వేల ఎకరాల భూమి
* గిరిజన తెగలలో బలహీన తెగల వర్గం గుర్తిస్తాం
* సీఆర్ డీఎ ద్వారా రాజధాని రైతులకు పరిహారం చెల్లింపులు
* కాపుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు
* బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 35 కోట్లు
* గర్భీణీ, బాలింతల కోసం 'అన్న హస్తం'
* 'అన్న హస్తం' కోసం రూ. 104 కోట్లు
* ఆప్కోకు పావలా వడ్డీ పథకం కింద రూ. 3.08 కోట్లు
* 2015-16లో 2.7 లక్షల కొత్త ఇళ్ళు
* ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లకు 'జియో ట్యాగింగ్' పూర్తి చేస్తాం
* చంద్రన్న సంక్రాంతితో పేదల కళ్లల్లో ఆనందం చూసాం
* రైతుకు అండదండగా ప్రభుత్వం
* స్వయం సహాయక బృందాల ద్వారా ధాన్యం కొనుగోలు
* అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం మోపుతాం
* రాజధాని భూసేకరణకు 87 శాతం మంది రైతులు అంగీకరించారు
* బోధనా ఆసుపత్రుల బలోపేతానికి కృషి
* ఎయిమ్స్ తరహా ఆసుపత్రుల కోసం రూ. 5,728 కోట్లు
* 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం
* రాష్ట్రంతో ప్రపంచాన్ని అనుసంధానం చేసేందుకు చర్యలు
* జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి
* పరిశోధనల కోసం ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ బోర్డు ఏర్పాటు
* టీవీ మాధ్యమం ద్వారా విద్యార్థులకు పాఠాలు