: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-2
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు...
* మైనారిటీ సంక్షేమానికి రూ. 379 కోట్లు
* స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 1,080 కోట్లు
* వికలాంగులకు రూ. 45 కోట్లు
* చేనేత రంగానికి రూ. 46 కోట్లు
* గృహ నిర్మాణ రంగానికి రూ. 897 కోట్లు
* వైద్య, ఆరోగ్య రంగానికి రూ. 5,728 కోట్లు
* విద్యా రంగానికి రూ. 14,962 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ. 8,212 కోట్లు
* ఇంటర్ ఉన్నత విద్యకు రూ. 3,049 కోట్లు
* గ్రామీణ నీటి సరఫరాకు రూ. 881 కోట్లు
* విద్యుత్ శాఖకు రూ. 4,062 కోట్లు
* మౌలిక సదుపాయాలకు రూ. 195 కోట్లు
* పర్యాటక రంగానికి రూ. 339 కోట్లు
* నైపుణ్యాల అభివృద్ధికి రూ. 360 కోట్లు
* గనులు, భూగర్భ శాఖకు రూ. 27 కోట్లు
* కార్మిక శాఖకు రూ. 281 కోట్లు
* పంచాయతీ రాజ్ శాఖకు రూ. 3,296 కోట్లు
* ఐటీ శాఖ అభివృద్ధికి రూ. 370 కోట్లు
* పరిశ్రమల అభివృద్ధికి రూ. 637 కోట్లు
* రోడ్లు, భవనాల కోసం రూ. 2,690 కోట్లు
* ఇంధన శాఖకు రూ. 4,360 కోట్లు
* హోం శాఖకు రూ. 4,062 కోట్లు
* దేవాదాయ శాఖకు రూ. 200 కోట్లు