: ఏపీ బడ్జెట్ ఈ విధంగా ఉండొచ్చు....
ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు 2015-16 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కింద తెలిపిన విధంగా బడ్జెట్ ఉండే అవకాశం ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం.
* బడ్జెట్ అంచనా రూ. 1.13 లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 80 వేల కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ. 33 వేల కోట్లు
* ద్రవ్య లోటు రూ. 8 వేల కోట్లు
* ఆర్థిక లోటు రూ. 18 వేల కోట్లు
* సామాజిక సేవలకు రూ. 12 వేల కోట్లు
* రైతు, డ్వాక్రా రుణమాఫీకి పెద్ద పీట వేసే అవకాశం
* వ్యవసాయానికి రూ. 9 వేల కోట్లు