: రెండు నెలల్లో 291 అత్యాచార కేసులు... ఇదీ మన దేశ రాజధాని హీనస్థితి

మహిళలపై ఎన్నో అత్యాచార ఘటనల్లో దోషులకు శిక్షలు పడుతున్నా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఘోరంగానే ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఢిల్లీలో ఏకంగా 291 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరీభాయ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. అంతేగాక, దేశ రాజధానిలో 2012లో 706... 2013లో 1636... 2014లో 2166 అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని... నగరంలో 5200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

More Telugu News