: నేడు సభ ముందుకు తెలంగాణ బడ్జెట్... అసెంబ్లీలో ఈటెల, మండలిలో కడియం ప్రసంగం
తెలంగాణ పూర్తి స్థాయి తొలి బడ్జెట్ నేడు సభ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత నిరుడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఈటెల, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ ను రూపొందించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా భారీతనంతో రూపొందిన ఈ బడ్జెట్ లో జమా ఖర్చులపై ఈటెల భారీ కసరత్తే చేశారు. ఏడాదిలోగానే రెవెన్యూ లోటుతో బడ్జెట్ ను రూపొందించారన్న వార్తల నేపథ్యంలో ఈ బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ ను అసెంబ్లీలో ఈటెల ప్రవేశపెట్టనుండగా, శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెడతారు.