: మరికొన్ని రోజులపాటు సెలవుల్లోనే రాహుల్ గాంధీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవులంటూ విదేశాలకు వెళ్లారు. ఈరోజు ఢిల్లీకి తిరిగిరావాల్సి ఉంది. అయితే, మరికొన్ని రోజులపాటు ఆయన సెలవులోనే ఉంటారని, ఈ వారాంతంలో తిరిగొస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు, ప్రస్తుత పార్టీ అస్థిరతపై పునరాలోచన చేసేందుకు రాహుల్ కొన్ని రోజుల కిందట సెలవుపై వెళ్లిన సంగతి విదితమే. దాంతో, తీవ్ర విమర్శలు రేకెత్తగా, సోషల్ మీడియాలోనూ పలు కథనాలు వచ్చాయి. అయితే, రాహుల్ విదేశాల్లో ఉన్నారని, త్వరలోనే వస్తారని పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. అంతేగానీ, రాజకీయాల నుంచి వైదొలగలేదని స్పష్టం చేశారు.