: 9 సవరణలతో భూసేకరణ బిల్లు... కొనసాగుతున్న చర్చ
లోక్ సభలో భూసేకరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం 9 సవరణలు ప్రతిపాదించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బిల్లుకు విపక్షాలు, మిత్రపక్షాల మద్దతు కోరారు. భూసేకరణ సవరణ బిల్లుకు శివసేన, అకాలీదళ్, టీడీపీ, బీజేడీ మద్దతిస్తున్నాయి. ఎంపీలు విధిగా ఓటింగ్ లో పాల్గొనాలని బీజేపీ విప్ జారీ చేసింది. కాగా, భూసేకరణ బిల్లును కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.