: జైత్రయాత్రను కొనసాగించండి... టీమిండియాకు మోదీ ప్రశంసలు

ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టీమిండియా ఆటతీరును కొనియాడుతూ ట్వీట్ చేయగా, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని ట్వీట్ చేశారు. వరుసగా విజయాలు సాధిస్తున్న ఇండియా ఇదే రీతిలో ముందుకు సాగాలని అభిలషించారు. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News