: బాలకృష్ణ కాల్పులకు, చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టేనా?: అసెంబ్లీలో జగన్
దాదాపు రెండు వారాల క్రితం కొనకనమిట్లలో జరిగిన నరసింహారెడ్డి హత్య కేసులో హోంమంత్రి ప్రకటన చేసిన అనంతరం వాడీవేడి వాదోపవాదాలు జరిగాయి. ఈ హత్యలో జగన్ కు, ఆయన బంధువు అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని తెలుగుదేశం సభ్యులు ఆరోపించారు. వీటిపై ఘాటుగా స్పందించిన వైకాపా అధినేత వై.ఎస్ జగన్, అవినాష్ తనకు బంధువని, ఆయన బంధువులకు దూరపు చుట్టరికం ఉన్న వారికి బంధువులైన వారిపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అంతమాత్రాన ఆ ఘటనకు, తనకూ సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఓ చిన్న ఉదాహరణ చెబుతానంటూ, గతంలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావించారు. ఆ ఘటనకు, బాలయ్య బంధువైన బాబుకు సంబంధం ఉన్నట్టేనా? అని మాట్లాడుతుండగా ఆయన మైకును స్పీకర్ కట్ చేశారు. కాసేపు గందరగోళం అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ మొదలైంది.