: నేడు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ... 14 న తిరిగి రాక

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. మారిషస్, సీషెల్స్, శ్రీలంకలో పర్యటించనున్న మోదీ, ఈ నెల 14న తిరిగి వస్తారు. ఈ పర్యటనలో భాగంగా సముద్ర జలాల్లో పరస్పర సహకారం దిశగా తాను పర్యటించే దేశాలను ఒప్పించే విషయంపై మోదీ దృష్టి సారించనున్నారు. శ్రీలంక తీరంలో సేదదీరుతున్న చైనా ఓడల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చైనా ఓడల అంశాన్నే శ్రీలంకతో ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

More Telugu News