: పరిమితుల మధ్య పనిచేస్తే సృజనాత్మకత బయటకు రాదు: అనుష్కా శర్మ
పరిమితుల మధ్య పనిచేస్తే సృజనాత్మకత బయటకు రాదని బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పేర్కొంది. తాజా సినిమా 'ఎన్ హెచ్ 10' విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సెన్సార్ బోర్డు అభ్యంతరం చెబుతుంటే కొత్త ఆలోచనలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. మనం పరిమితుల మధ్య పని చేస్తే అర్థవంతమైన, వాస్తవమైన ఆలోచనలు రావని తెలిపింది. కాగా, ఎన్ హెచ్ 10 కొత్త ప్రయత్నమని, సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అనుష్కా శర్మ స్పష్టం చేసింది. సినిమాలో అనుష్కకు జోడీగా నీల్ భూపాలం నటించగా, నవదీప్ సింగ్ దర్శకత్వం వహించారు.