: తానా మహాసభల కోసం ప్రత్యేక వెబ్ సైట్

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'తానా' 20వ మహాసభలు ఈ ఏడాది జులై 2 నుంచి జరగనున్నాయి. డెట్రాయిట్ లో ఈ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల కోసం ప్రత్యేక వెబ్ సైట్ కు రూపకల్పన చేశారు. డెట్రాయిట్ లో తానా సభల కన్వీనర్ గంగాధర్ ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, సెక్రటరీ సతీష్ వేమన, తదితరులు పాల్గొన్నారు. తానా సభలు ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించడం తెలిసిందే. సినీ కళాకారులు, సాహితీవేత్తలు, రాజకీయనేతలు... ఇలా వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది.

More Telugu News