: ఆ ఎమ్మెల్సీలు ఇక టీడీపీ వాళ్లు కాదు... టీఆర్ఎస్ సభ్యులే: స్వామిగౌడ్

పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని టీటీడీపీ డిమాండ్ చేస్తుండగా, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా పేర్కొనడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఆరంభమైన తరువాత పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ శాసనమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, మహ్మద్ సలీంలు ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీలని మండలి ఛైర్మన్ చెప్పారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News