: మీరు చేస్తే సంసారం... మేం చేస్తే వ్యభిచారమా?: టి.టీడీపీపై జీవన్ రెడ్డి ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో ఓ వైపు మొన్నటి ‘రభస’ కలకలం రేపుతుంటే, తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై టి.టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ‘‘మీరు చేస్తే సంసారం... మేం చేస్తే వ్యవభిచారమా?’’ అంటూ ప్రశ్నించి కలకలం రేపారు. టీడీపీ నేతలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీట నొక్కితే... ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా ఆడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల నేతలను మీ పార్టీలో చేర్చుకోవడం లేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను మీ పార్టీలో చేర్చుకోగా లేనిది, తాము చేర్చుకుంటే తప్పేమిటని నిలదీశారు.