: రన్నరప్ తో సరిపెట్టుకున్న సైనా... అనూహ్యంగా నెగ్గిన మారిన్
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో 21-16, 14-21, 7-21తో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్ నెగ్గిన సైనా అదే ఊపులో రెండో గేమ్ గెలిచి టైటిల్ కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ, స్పానిష్ అమ్మాయి మారిన్ అనూహ్యంగా పుంజుకుని వరుసగా రెండు గేములు నెగ్గి చాంపియన్ గా నిలిచింది. దీంతో, సైనాకు నిరాశ తప్పలేదు.