: పుట్టపర్తిలో వింత వ్యాధి... ఒక్కరోజే 30 కుక్కల మృతి
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో వింత వ్యాధి కలకలం రేపింది. ఈ వ్యాధి కారణంగా ఒక్కరోజే 30 కుక్కలు మృతి చెందడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. పెద్ద సంఖ్యలో శునకాలను బలి తీసుకుంటున్న ఈ వ్యాధి ఏమిటన్నది పశు వైద్యాధికారులకు కూడా అంతుబట్టడంలేదు. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో, ప్రజలు మరింతగా భయపడుతున్నారు. వ్యాధి గురించి వైద్యుల్లోనూ స్పష్టత లేకపోవడంతో, ఇది తమకూ సోకుతుందేమోనని పుట్టపర్తి ప్రజలు హడలిపోతున్నారు.