: సిగ్గుతో తలలు దించుకుంటున్నాం: మోదీ

మహిళలపట్ల జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీలపై జరుగుతున్న ఘోర నేరాల గురించి విన్నప్పుడు సిగ్గుతో తలలు దించుకుంటున్నామని అన్నారు. మహిళలపట్ల ఎటువంటి నేరాలూ జరగకుండా ఉండే రోజు కోసం కృషి చేస్తానని తెలిపారు. భారత అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంత ఘనమో తనకు తెలుసునని వివరించిన ఆయన మహిళల సమానత్వంపై మన ప్రతిజ్ఞను మరోసారి గుర్తు చేసుకోవాలని కోరారు.

More Telugu News