: ఓటమి మా విశ్వాసాన్ని దెబ్బతీయదు...కప్పు మాదే!: డివిలీర్స్
వరల్డ్ కప్ లో రెండు పరాజయాలు చవిచూసినంత మాత్రాన తమ ప్రతిభపై అనుమానాలు అవసరం లేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలీర్స్ స్పష్టం చేస్తున్నాడు. ఓటమి అనంతరం డివిలీర్స్ మాట్లాడుతూ, రెండు పరాజయాలతో గ్రూప్ బీలో రెండో స్ధానంలో ఉన్నామని, భారత్, పాక్ పై ఓటమి తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదని అన్నాడు.
సౌతాఫ్రికా జట్టుకు వరల్డ్ కప్ సాధించడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని డివిలీర్స్ తెలిపాడు. వరల్డ్ కప్ సాధించే బెస్ట్ టీమ్ తమదేనని, అందులో అనుమానాలు వద్దని డివిలీర్స్ సూచించాడు. ఒత్తిడిలో సఫారీలు ఓటమిపాలవుతారనేది నిజం చేశారా? అంటే గతంలో చాలా మ్యాచుల్లో ఒత్తిడిలో ఉండగా కూడా విజయం సాధించామని ఆయన చెప్పారు. తాజా ఓటమికి కారణాలు వెతకదలచుకోలేదని ఎబీ తెలిపాడు.