: అత్యాచారం కంటే మార్ఫింగే నీచం!: హన్సిక

అత్యాచారం కంటే మార్ఫింగే నీచమైన పని అని సినీ నటి హన్సిక తెలిపారు. విషయం అర్థమై ఉంటుంది...హన్సిక మార్ఫింగ్ వీడియో బాధితురాలైంది. స్నానం చేస్తున్న ఓ మహిళకు హన్సిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఇదిప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీని సంగతి ఆమె సన్నిహితులు ఈ విషయాన్ని ఆమె చెవిన వేశారు. దీంతో ఆమె చిందులు తొక్కుతోంది. ఇలాంటి పని ఎలా చేస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్ఫింగ్ అశ్లీల చిత్రాలను వ్యాప్తి చేయడం రేప్ కంటే నీచం అంటూ అసహనం వ్యక్తం చేసింది. కథానాయికలు విలాసవంతమైన జీవితం గడుపుతారని అంతా భావిస్తారని, అభిమానులకు వినోదం అందించడానికి తాము 24 గంటలూ కఠోరంగా శ్రమిస్తామని హన్సిక తెలిపింది. మరి పోలీసులకు ఫిర్యాదు చేయచ్చు కదా, అని సలహా ఇస్తే, అందులో ఉన్నది తాను కాదని తెలిశాక ఫిర్యాదు చేయడం ఎందుకు? అని ఎదురు ప్రశ్నించింది.

More Telugu News