: దీపికా పదుకొనేను అరెస్టు చేయవద్దు: న్యాయస్థానం
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేకు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఏఐబీ రోస్ట్ లో అసభ్య పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో దీపికను అరెస్టు చేయొద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ రంజిత్ మోరే, అనుజా ప్రదు దేశాయ్ లతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఏఐబీ రోస్ట్ లో పాల్గొన్నందుకు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఈ నెల 2న బాంబే హైకోర్టును దీపికా పదుకొనే ఆశ్రయించింది.
దీంతో మార్చి 16 అంటే పిటిషన్ పై విచారణ చేపట్టేవరకు ఆమెను అరెస్టు చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత డిసెంబర్ లో ఏఐబీ రోస్ట్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే... ఇందులో జుగుప్సాకరమైన పదాలు ఉపయోగించి చేసిన హాస్యం అక్కడి వారిని నవ్వించినా దేశ వ్యాప్తంగా విమర్శలపాలైంది.