: 40 ఓవర్లలో పాక్ స్కోర్ 197/5... నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యం 40 ఓవర్లకు 240?

వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా, ఆక్లాండ్ లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కి వరుణుడు పలుమార్లు అడ్డు తగిలాడు. ఇప్పటివరకూ మూడు సార్లు వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. చివరిగా ఆట ఆగిపోయే సమయానికి పాకిస్థాన్ 40.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. మరో అరగంట పాటు ఆట నిలిస్తే, డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా జట్టు 40 ఓవర్లలో సుమారు 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాల్సి వుంటుంది. మరికాసేపట్లో ఈ విషయంలో స్పష్టత రానుంది.

More Telugu News