: మరో వికెట్ కోల్పోయిన విండీస్... 23 ఓవర్లకు 84/6

వెస్టిండీస్ వికెట్ల పతనం కొనసాగుతోంది. టీమిండియా పేసర్ మహ్మద్ షమి కరీబియన్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చగా, తాజాగా స్పిన్నర్లు రంగంలోకి దిగి ప్రభావం చూపుతున్నారు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ ఐదో బంతికి కార్టర్ (21) ను పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ వేసిన మిస్టరీ బంతిని బౌండరీ తరలించబోయిన కార్టర్, మహ్మద్ షమీ చేతికి చిక్కాడు. అనంతరం, డారెన్ సామీకి ఆండ్రూ రస్సెల్ జత కలిశాడు. 23 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 6 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.

More Telugu News