: 'దురంతో' ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ... మహిళ నుంచి 150 తులాల బంగారం అపహరణ

విశాఖ నుంచి హైదరాబాదు బయలుదేరిన 'దురంతో' ఎక్స్ ప్రెస్ లో రాత్రి భారీ చోరీ జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 150 తులాల బంగారాన్ని దొంగలు అపహరించారు. మహిళ వద్ద భారీ మొత్తంలో బంగారాన్ని గుర్తించిన దొంగలు ఆమెను మారణాయుధాలతో భయపెట్టి, బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు కొద్దిసేపటి క్రితం సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు మొదలుపెట్టారు.

More Telugu News