: యూట్యూబ్ నుంచి 'నిర్భయ' డాక్యుమెంటరీ తొలగింపు


'ఇండియాస్ డాటర్' పేరుతో బ్రిటన్ దర్శకురాలు తెరకెక్కించిన 'నిర్భయ' డాక్యుమెంటరీని యూట్యూబ్ నుంచి తొలగించారు. భారత్ మినహా మిగతా దేశాల్లో నిన్న (బుధవారం) రాత్రి ఈ డాక్యుమెంటరీని బీబీసీ ఛానల్ ప్రసారం చేసింది. ఈరోజు ఆ వీడియో యూట్యూబ్ లో భారత్ లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించేందుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. 'ఇండియాస్ డాటర్' వీడియోను యూట్యూబ్ లో బ్లాక్ చేయాలని కోరడంతో వెంటనే స్పందించి నిలిపివేశారు.

  • Loading...

More Telugu News