: ఏపీలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్


ఏపీలో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలకానుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 17న తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం ఐదుగురు సభ్యుల ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. పాలడుగు వెంకట్రావు మరణంతో ఇప్పటికే ఖాళీగా ఉన్న మరో స్థానానికి ఎన్నిక జరగనుంది. మరోవైపు ఈ నెల 29తో రుద్రరాజు పద్మరాజు, నన్నపనేని రాజకుమారి, మరో ఇద్దరు ఎమ్మెల్సీల పదీవీకాలం ముగియనుంది.

  • Loading...

More Telugu News