: పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య 352


పాకిస్థాన్ లోని వివిధ జైళ్లలో 352 మంది భారతీయులు మగ్గుతున్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ లోక్ సభకు తెలిపారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, 2015 జనవరి 1వ తేదీ నాటికి 50 మంది పౌరులు, 476 మంది జాలర్లు పాక్ జైళ్లలో ఉండేవారని తెలిపారు. ఈ ఫిబ్రవరిలో పాక్ 174 మందిని భారత్ కు అప్పగించిందని వారు పేర్కొన్నారు. దీంతో పాక్ జైళ్లలో ఉంటున్న భారతీయుల సంఖ్య 352కు తగ్గిందని తెలిపారు. అలాగే భారత్ జైళ్లలో పాక్ పౌరులు 253 మంది, 132 మంది జాలర్లు ఉన్నారని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News