: పారిశ్రామిక వేత్తలా, ప్రజలా? కేంద్రమే నిర్ణయించుకోవాలి: శరద్ యాదవ్
అన్ని వర్గాల ప్రజలు తమను అధికారంలో కూర్చోబెట్టారని, ఏం చేయాలో తమకు తెలుసని చెప్పిన ప్రధానిని శరద్ యాదవ్ నిలువరించారు. భారతదేశం అంటే లోక్ సభలోనో, రాజ్యసభలోనో కూర్చునే వారు కాదని అన్నారు. మీరు చెబుతున్న గిరిజనులు, బీద ముస్లింలు, సిక్కులు, ఇతర ప్రజల వల్ల అధికారంలో కూర్చుని వారికోసం ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మకంతో వారు ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేస్తే ఏం చేయాలో వారికి తెలుసని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలా? ప్రజలా? నిర్ణయించుకోవాల్సిన అవసరం కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయాలని ఆయన సూచించారు.