: ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5న జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. కొన్నిరోజుల్లో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలు, అనుసరించాల్సి వ్యూహం, ప్రభుత్వం తరపున చెప్పాల్సిన సమాధానాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేగాక ప్రభుత్వ పథకాలు మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కేజీ టు పీజీ, సంక్షేమ పథకాల అమలుపైన చర్చిస్తారు. మార్చి 7నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.

More Telugu News