: పార్లమెంటులో ఏపీ హైకోర్టు అంశంపై చర్చ

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీ హైకోర్టును విభజించాలని రాష్ట్ర విభజన బిల్లులో చాలా క్లియర్ గా ఉందని... రాష్ట్రం విడిపోయి తొమ్మిది నెలలైనా హైకోర్టు విభజన ఇంకా జరగలేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. హైకోర్టును విభజించాలని కోరుతూ నేడు లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని... కోర్టు రిక్రూట్ మెంట్లలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఈ అంశం న్యాయశాఖ పరిశీలనలో ఉందని, విభజనపై కసరత్తు జరుగుతోందని వివరించారు.

More Telugu News