: లోక్ సత్తా నుంచి మరో ముగ్గురిపై బహిష్కరణ వేటు
లోక్ సత్తా పార్టీలో అసమ్మతి వర్గం పెరిగిపోతుండటంతో మరో ముగ్గురిపై బహిష్కరణ వేటు పడింది. తాజాగా మనోరమ, శివరామకృష్ణ, సీహెచ్ వజీర్ లను పార్టీ నుంచి బహిష్కరించినట్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవాస్తవ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న కారణంగానే వారిపై చర్యలు తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. గత నెలలో పార్టీ నుంచి డీవీవీఎస్ వర్మ, కటారి శ్రీనివాసరావు, ఎ.శివరమేష్ రెడ్డిలపై వేటు వేసిన సంగతి విదితమే.