: టీమిండియా ఫీల్డింగ్ నైపుణ్యం వెనుక ఎవరున్నారు?

ప్రపంచకప్ లో టీమిండియా అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తోంది. ఫీల్డింగ్ తో ఆకట్టుకునే సౌతాఫ్రికా, ఆసీస్, కివీస్ జట్లకు దీటుగా టీమిండియా ఆటగాళ్లు బంతిని అడ్డుకుంటున్నారు. అద్భుత విన్యాసాలతో ఇంత వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో 23 క్యాచ్ లు పట్టారు. టీమిండియా ఆటగాళ్లు పట్టిన 23 క్యాచ్ లే వరల్డ్ కప్ లో ఇంతవరకు ఓటమి లేకుండా ఉండడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ నైపుణ్యం ఉన్నపళంగా పెరగడం వెనుక ఉన్నదెవరని సర్వత్ర ఆసక్తి పెరుగుతోంది. దీనివెనుక మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ఉన్నాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా విధులు నిర్వర్తిస్తున్న బంగర్ ఫీల్డింగ్ పై ప్రత్యేక శ్రద్ధపెట్టాడు. మైదానంలో పాదరసంలా కదలాల్సిన అవసరాన్ని ఆటగాళ్లకు వివరించాడు. కసరత్తులు చేయిస్తూ ఆటగాళ్లలో కసి పెంచాడు. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్ లో టీమిండియా ఫీల్డింగ్ విన్యాసాలు అదరగొడుతున్నాయి. గతంలో బంతిని బౌండరీ లైన్ వద్దనున్న ఫీల్డర్ కి చూపించే ఆటగాళ్లు, ఇప్పుడు బంతి వెనుక పరుగెడుతున్నారు.

More Telugu News