: రైల్వే ప్రయాణికుల ఫిర్యాదులకు కొత్త యాప్

రైల్వే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు కొత్త యాప్ ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు విడుదల చేశారు. ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ల కోసం సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యాప్ ను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. యాప్ తో పాటు ఇంటర్నెట్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ప్రయాణికులు ఫిర్యాదు చేసే సౌలభ్యం కూడా కల్పిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. www.indianrailways.gov.in ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన చెప్పారు. అలాగే మొబైల్ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించే విధానం ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు.

More Telugu News