: ఇప్పటివరకు 661 మంది ఎంపీలు గ్రామాలను దత్తత చేసుకున్నారు: కేంద్రం
'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకం కింద ఇప్పటివరకు 661 మంది ఎంపీలు గ్రామాలను దత్తత చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందులో 485 మంది లోక్ సభ సభ్యులు, 176 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఈరోజు రాజ్యసభలో తెలిపారు. "సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకంపై మాకు మంచి స్పందన వచ్చింది. 84 శాతం మంది అంటే 661 మంది పార్లమెంటు సభ్యులు ఈ పథకంపై ఆసక్తి చూపారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకున్నారు" అని క్వశ్చన్ అవర్ లో మంత్రి సభకు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.