: జనాలకు రోజుకో సినిమా చూపిస్తూ, పబ్బం గడుపుకుంటున్నాడు: కేసీఆర్ పై సబిత ఫైర్
తెలంగాణ ప్రజలకు రోజుకో కొత్త సినిమా చూపిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తన కంటబడిన భూమినంతటినీ అమ్మే ప్రయత్నంలో సీఎం ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన కేసీఆర్... వాటన్నింటినీ గాలికొదిలేశారని విమర్శించారు. గతంలో ప్రతి రోజు ఆంధ్రులను కించపరిచే రీతిలో మాట్లాడిన కేసీఆర్... ఇప్పుడు హైదరాబాదులో ఓట్ల కోసం మాట మార్చారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, పైవ్యాఖ్యలు చేశారు.