: నేనూ అదే చెబుతా...అలా అని కేజ్రీవాల్ చెప్పినట్టు చేయమనను: ముఫ్తీ సయీద్
అవినీతిని అంతం చేయడమే తొలి ప్రాధాన్యం అని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అవినీతిని అంతం చేయకపోతే అభివృద్ధి ఫలాలు అందరికీ అందవని అన్నారు. కేజ్రీవాల్ చెప్పినట్టు అవినీతిని అంతం చేయాలని సూచిస్తానని, అయితే కేజ్రీవాల్ సలహా పాటించమని మాత్రం ప్రజలకు సూచించలేనని ఆయన పేర్కొన్నారు. కాగా, మొబైల్ ఫోన్ సహాయంతో అవినీతిని బహిర్గతం చేయాలని కేజ్రీవాల్ సూచించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ భాగస్వామి కనుక రాష్ట్రాభివృద్ధిపై సందేహం అవసరం లేదని ఆయన చెప్పారు.