: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువకుడు... డీఐజీ మేనల్లుడినంటూ హల్ చల్!

మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఓ యువకుడు తప్పించుకునేందుకు నానా పాట్లు పడ్డాడు. అతడెన్ని కారణాలు, ఎన్ని లింకులు చెప్పినా వినని హైదరాబాదు పోలీసులు విలువైన బీఎండబ్ల్యూ కారు సహా అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో నిన్న రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు, మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న 25 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలోని ఓ యువకుడు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విఫల యత్నం చేశాడు. తాను ఓ డీఐజీ మేనల్లుడినంటూ అతడు బుకాయించే యత్నం చేశాడు. అయితే, అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More Telugu News