: దిగ్విజయ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు మహారాష్ట్ర మాజీ స్పీకర్ శ్రీనివాస్ తివారీ, మరో 17 మందిపై కూడా భోపాల్ లోని జహంగీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి వ్యతిరేక చట్టం కింద వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 1993-2003 మధ్య తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర సెక్రటేరియట్ లో మోసపూరిత నియామకాలు చేపట్టిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు, డిగ్గీ ఈరోజు తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

More Telugu News