: కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు - పార్ట్ 2
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని ప్రధానాంశాలు.
* 2016 ఏప్రిల్ 1 నాటికి జీఎస్టీని అమల్లోకి తీసుకొస్తాం.
* ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి విలువ బలపడింది.
* ఇండియాను తయారీ కేంద్రంగా మారుస్తాం.
* ప్రతి 5 కిలోమీటర్లకు ఓ పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్లకు ఓ కళాశాల ఏర్పాటు చేస్తాం.
* నీటి పారుదల పథకాలను మెరుగుపరిచి, వ్యవసాయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళతాం.
* దేశ ఆర్థిక వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి.
* ఉన్నత ఆదాయ వర్గాలకు వంటగ్యాస్ రాయితీని నిలిపివేస్తాం.
* పార్లమెంటు సభ్యులు కూడా స్వచ్ఛందంగా వంటగ్యాస్ రాయితీని వదులుకోవాలి.
* స్టార్టప్ కంపెనీలకు అధిక ప్రోత్సాహం.
* బొగ్గుగనుల వేలంతో లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది.
* 80 వేల ప్రాథమిక పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తాం.
* రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తు సేవల పన్నులు
* కేంద్ర ఆదాయం నుంచి రాష్ట్రాలకు 62 శాతం నిధులను ఇస్తాం.
* వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది.
* ప్రతి గ్రామంలో వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తాం.
* రూ. 20 వేల కోట్లతో 'ముద్ర బ్యాంక్'తో సూక్ష్మ రుణాలు.
* మరో లక్ష కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తాం.
* నష్టదాయక కంపెనీలు, ఆదాయం లేని సంస్థల నుంచి పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటాం.
* యువతను నైపుణ్యం గల పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం.
* సబ్సిడీల దుర్వినియోగాన్ని నిరోధిస్తాం.
* హామీ మేరకు ద్రవ్యలోటును 4.1 శాతానికి నియంత్రిస్తాం.
* ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి కట్టడి చేస్తాం.
* ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.
* చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టులకు రూ. 5300 కోట్లు.
* 2015-16లో రూ. 8.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు.
* 'అటల్' పెన్షల్ పథకం అమలు చేస్తాం.
* ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు.
* 11.45 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సిడీ అందించాం.
* స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం.
* ఎల్పీజీ సబ్సిడీలు, స్కాలర్ షిప్ లు నేరుగా లబ్ధిదారులకే బదిలీ.
* మైనార్టీ యువత కోసం 'నయీ మంజిల్' అనే పథకం. మైనార్టీల కోసం సమీకృత విద్యా పథకం.
* మౌలిక వసతుల కల్పన కోసం అదనంగా మరో రూ. 70 వేల కోట్లు
* సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు.
* గ్రామీణ మౌలిక వసతుల కల్పన కోసం రూ. 25 వేల కోట్ల నిధులు.
* ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కోసం తొలి విడతలో రూ. 34,699 కోట్ల కేటాయింపు
* ప్రధాని వ్యవసాయ పథకం మరియు మైక్రో ఇరిగేషన్ కోసం రూ. 5300 కోట్లు
* 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల నిర్మాణం